Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ ఫోన్ రికార్డులున్నాయి... నేరుగా కేంద్రానికి అప్పగిస్తాం: ఎర్రబెల్లి

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేసినట్టు తమ వద్ద ఆధారాలున్నాయని, ఆ ఫోన్ రికార్డులను తాము నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి రూ.20 కోట్ల వరకు ఆఫర్ చేశాడని, అందుకు ఆధారాలున్నాయని తెలిపారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి... కేసీఆర్ డబ్బులిస్తేనే పార్టీలోకి వెళ్లానని చెప్పారని ఎర్రబెల్లి తెలిపారు. ఇక, చంద్రబాబు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడాడని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు. నాయిని బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు.

More Telugu News